New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ విప్లవంలో భాగంగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం గౌహతిలో దేశంలోనే మొదటి ‘ఏఐ ఆధారిత డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్’ను ప్రారంభించారు. ‘స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్’ (Slice Small Finance Bank) ఈ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో అసోం ఎమ్మెల్యే అశోక్ సింఘాల్, స్లైస్ ఎండీ రాజన్ బజాజ్, ఎన్పీసీఐ ఎండీ దిలీప్ అస్బే తదితరులు పాల్గొన్నారు.
ఈ కొత్త బ్యాంక్ బ్రాంచ్ డిజిటల్, ఫిజికల్ సేవలను కలిపి అందిస్తుంది. ఇక్కడ ఏఐ కియోస్క్‌లు, క్యూఆర్ కోడ్ బ్యాంకింగ్, తక్షణ అకౌంట్ ఓపెనింగ్, డిజిటల్ పాస్‌బుక్ ప్రింటింగ్ వంటి అధునాతన సేవలు లభిస్తాయి.
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. అసోం డిజిటల్ ప్రయాణంలో ఇదొక మైలురాయి అని, గౌహతి నగరం పెద్ద కంపెనీలకు కేంద్రంగా మారుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. ఆర్బీఐ అనుమతితో ‘నార్త్ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్’, ఫినోటెక్ స్టార్టప్ ‘స్లైస్’ విలీనమై ఈ కొత్త బ్యాంక్‌గా ఏర్పడిందని, దీని ప్రధాన కార్యాలయం గౌహతిలోనే ఉందని బ్యాంక్ చైర్పర్సన్ యూజీన్ కార్థక్ తెలిపారు. ఈ బ్యాంక్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ప్రతిరోజూ వడ్డీని జమ చేస్తుంది.
ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను సులభంగా చేర్చడమే లక్ష్యంగా గౌహతిని ఎంచుకున్నట్లు బ్యాంక్ యాజమాన్యం తెలిపింది. మిజోరం, నాగాలాండ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ బ్యాంకులు తక్కువగా ఉన్నాయని, డిజిటల్ విధానం ద్వారా అక్కడి ప్రజలందరికీ సులువుగా సేవలు అందించవచ్చని పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను చేర్చడమే తమ లక్ష్యమని, రాబోయే 2-3 ఏళ్లలో ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ బ్యాంకింగ్ సంస్థగా ఎదగాలని చూస్తున్నట్లు స్లైస్ ఎండీ రాజన్ బజాజ్ వివరించారు.
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!