IND v ENG: భారత్‌కు అచ్చొచ్చిన ఉప్పల్ మైదానం.. అశ్విన్‌కు తిరుగేలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Uppal Stadium Records: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై సంప్రదాయ పిచ్‌లపై ఎదురులేని భారత్.. బాజ్‌బాల్ ఆటతో హోరెత్తిస్తున్న ఇంగ్లండ్ మధ్య టెస్టు పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు వేదికైన ఉప్పల్ స్టేడియం పిచ్‌పై అందరి దృష్టి నెలకొంది. ఉప్పల్ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందా? లేదా బౌన్స్‌తో కూడిన పేస్‌కు సహకరిస్తుందా? అన్న చర్చ మొదలైంది. అయితే ఉప్పల్ మైదానంలో భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది.
టెస్టుల్లో భారత్‌కు కలిసొచ్చిన వేదికల్లో ఉప్పల్ కూడా ఒకటి. ఉప్పల్ స్టేడియంలో ఐదు టెస్టులాడిన భారత్.. నాలుగింట్లో గెలుపొందింది. 2010లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. ఆపై న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లపై గెలిచింది. ఉప్పల్‌లో వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ నాలుగు మ్యాచ్‌లాడిన అశ్విన్.. మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు. యాష్ ఆడిన అన్నింట్లోనూ భారత్ గెలవడం విశేషం. ఇక్కడ రవీంద్ర జడేజా (15), ఉమేశ్ యాదవ్ (15) కూడా రాణించారు. మాజీలు ప్రజ్ఞాన్ ఓజా (9), హర్భజన్‌సింగ్ (7) కూడా వికెట్స్ పడగొట్టారు.
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
Also Read: IND vs ENG: కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడు.. కేఎస్ భరత్‌కు లైన్ క్లియర్!
ఉప్పల్‌లో తొలిసారిగా 2010 నవంబర్ 12 నుంచి 16 వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు జరిగింది. ఆ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. హర్భజన్ సింగ్ (111 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. 2012 ఆగస్టు 23 నుంచి 26 వరకు న్యూజిలాండ్‌తో భారత జట్టు రెండో టెస్టు ఆడింది. ఆర్ అశ్విన్ 12 వికెట్లు తీయడంతో భారత జట్టు ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో గెలిచింది. 2013 మార్చి 2 నుంచి 5 వరకు భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. చతేశ్వర్ పుజారా (204) డబుల్ సెంచరీ చేశాడు. 2017 ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉప్పల్ వేదికపై నాలుగో టెస్టు జరిగింది. విరాట్ కోహ్లీ (204; 24 ఫోర్లు) డబుల్ సెంచరీతో భారత్ విజయం సాధించింది. 2018లో ఉప్పల్‌లో చివరిసారిగా వెస్టిండీస్‌తో భారత్ టెస్టు ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్లతో ఘనవిజయం నమోదు చేసింది.
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?