West Bengal : ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి.. ఆ స్కామ్ వల్లే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని దుర్గాపుర్ లో జరిగింది. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి, మరో ఆరేళ్ల బాలుడు ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీచర్ ఎలిజబిలిటి టెస్ట్ స్కామ్ లో ఉన్నవారే తమ మృతికి కారణమని రాసి ఉంది. ఈ దారుణ ఘటన దుర్గపుర్ లో జరిగింది.
Also Read : Uttarakhand : కుక్కపై కర్కశత్వం.. బండికి కట్టి ఈడ్చుకెళ్లిన వైనం
Also Read
మృతులు అమిత్ కుమార్ మొండల్(35), రూపా మొండల్(31).. దంపతుల పిల్లలు నిమిత్ కుమార్ మొండల్(6), నిఖితా మొండల్( ఏడాదిన్నర వయసు)గా పోలీసులు గుర్తించారు. అమిత్ మృతదేహం సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ ఉంది. రూపా, ఆమె ఇద్దరి పిల్లల మృతదేహాలు కింద పడి ఉన్నాయి. మృతుల మొబైల్లో ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. టీఈటీ కుంభకోణంలో పాల్గొన్నవారే తమ మృతికి కారణమన్నట్లు అందులో ఓ మెసేజ్ ఉంది. స్థానికులు మాత్రం అత్మహత్య కాదు.. కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. వారి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఆ విషయంలోనే వీరిని హత్య చేసి ఉంటారని చెబుతున్నారు.
Also Read : Uttarakhand : విద్యార్థుల వీరంగం.. వార్డెన్ పై వేధింపులే కారణం!
అమిత్ కుటుంబం మృతికి అతని తల్లే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే అమిత్ తల్లి, కుంటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదం కారణంగానే అమిత్ కుటుంబాన్ని హత్య చేశారు. అమిత్ మెడపై గాయాలు ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదు.. కచ్చితంగా హత్యే.. అందరి చేతులు కట్టేసి ఉన్నాయి సీసీ కెమెరా పాలిథీన్ కవర్ తో మూసేసి ఉంది. అమిత్ తల్లి, మిగతా కుటుంబసభ్యులే వారిని హత్య చేశారు. అమిత్ భార్య రూప కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అమిత్ తండ్రి.. నరేశ్ మొండల్ చాలా ఏళ్ల క్రితం మృతి చెందారు. అతను చాలా ఆస్తులు సంపాదించాడు. ఆ ఆస్తుల కోసమే వీరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారని డీసీపీ గౌతమ్ కుమార్ వెల్లడించారు. అమిత్ కుటంబ సభ్యుల మృతికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు