ఉత్తరప్రదేశ్ లో హృదయ విదారక ఘటన జరిగింది. మూగజీవి పట్ల క్రూరంగా ప్రవర్తించాడో వ్యక్తి. కుక్కను మోటార్ సైకిల్ కు కట్టి ఈడ్చుకెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఘజియాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
Also Read : Uttarakhand : విద్యార్థుల వీరంగం.. వార్డెన్ పై వేధింపులే కారణం!
మూగజీవం పట్ల ఓ వ్యక్తి అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో శనివారం ఇస్మాయిల్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ కు ఓ కుక్కను కట్టి రెండున్నర కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. ఈ అమానుష ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది. కాగా ఇస్మాయిల్ తన బండికి కుక్కను కట్టి విజయనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ విహార్ ఔట్ పోస్ట్ నుంచి వెళుతున్నాడు. అవుట్ పోస్ట్ దగ్గరికి రాగానే స్థానికులు అతడిని గమనించి.. ఆపమని కేకలు వేశారు. అతన వినకపోవడంతో టూ వీలర్ మీద వెంటపడ్డారు.
Also Read : MLC Elections 2023: ఎమ్మెల్యేలపై ఇంటెలిజెన్స్ నిఘా..! ఎందుకో తెలుసా..?
మరికొందరు పీపుల్స్ ఫర్ యానిమల్స్ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని మీద జంతువులను హింసిస్తున్నాడన్న కేసు నమోదు చేశారు. అయితే ఇలా ఎందుకు చేశావు అని ఇస్మాయిల్ ను అడగగా.. ఆ కుక్క చాలా మందిని కరిచిందని తెలిపాడు. అందుకే.. దాన్ని తమ ప్రాంతానికి దూరంగా వదిలేయడానికి తీసుకు వెళ్తున్నానని పోలీసులకు తెలిపాడు.