Singapore Airlines: విమానంలో తీవ్రమైన అలజడి.. ఒకరి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గగనతలంలో ఉండగా తీవ్రమైన అల్లకల్లోనికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. అనంతరం ఫ్లైట్ బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ హఠాత్తు పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: Rajasthan: ఇంట్లో సమస్యలు ఉన్నాయని వెళ్తే.. ఆస్తి కాజేసిన తాంత్రికుడు
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
లండన్ నుంచి వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్రమైన అల్లకల్లోలానికి గురైనట్లుగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. మంగళవారం బ్యాంకాక్‌లో అత్యవసర ల్యాండింగ్ అయినట్లు పేర్కొంది. అందులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు మరణించాడని.. పలువురు గాయపడినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. బోయింగ్ 777-300ER విమానం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్‌కు బయలుదేరింది. గగనతలంలో ఉండగా భారీ కుదుపులకు లోనైంది. దీంతో బ్యాంకాక్‌లో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకరు చనిపోయినట్లుగా.. 30 మంది గాయపడినట్లుగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ ధృవీకరించింది.
ఇది కూడా చదవండి: Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్ సమావేశంలో తొక్కిసలాట..
లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు విమానం బయలుదేరింది. మార్గమధ్యంలో తీవ్రమైన అల్లకల్లోలాన్ని ఎదుర్కొంది అని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. విమానం బ్యాంకాక్‌లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించబడిందని.. మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ల్యాండ్ అయినట్లు స్పష్టం చేసింది.
మృతుడి కుటుంబానికి ఎయిర్‌లైన్స్ సంతాపం తెలిపింది. క్షతగాత్రలకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పింది. ప్రయాణికులకు, సిబ్బందికి సాయం అందించడమే తమ ప్రాధాన్యత అని తెలిపింది. అవసరమైన వైద్య సదుపాయాలు అందిచేందుకు థాయ్‌లాండ్‌లోని స్థానిక అధికారులతో కలిసి పని చేస్తున్నట్లు చెప్పింది. అలాగే బ్యాంకాక్‌కు ఒక బృందాన్ని పంపుతున్నట్లు ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
Singapore Airlines flight #SQ321, operating from London (Heathrow) to Singapore on 20 May 2024, encountered severe turbulence en-route. The aircraft diverted to Bangkok and landed at 1545hrs local time on 21 May 2024.
We can confirm that there are injuries and one fatality on…
— Singapore Airlines (@SingaporeAir) May 21, 2024
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!