మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, వన్డేలో ప్రపంచ మాజీ నంబర్ 1 బౌలర్ లోన్వాబో త్సోత్సోబే అరెస్టయ్యాడు. ఇతనితో పాటు థమీ సోలెకిలే, ఎథి మభలాటి అరెస్టయ్యారు. మ్యాచ్ జరుగుతుండగానే పోలీసులు వీరిని అరెస్టు చేశారు. 2015-16 రామ్‌స్లామ్ టీ-20 మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో వీరిని అరెస్ట్ చేశారు. ఈ క్రికెటర్లపై ఐదు అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి.