ఫేమస్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ కు ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ వుంది. ఈ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది.ప్రస్తుతం ఏడో సీజన్ కు ముహూర్తం ఫిక్స్ అయింది.. ఈ షో గ్రాండ్ లాంచ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సీజన్ కు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రొమోలు షో పై మరింత ఆసక్తిని పెంచేసాయి. ఈ సారి సీజన్ సరికొత్తగా ఉండబోతుందని సమాచారం.ఇక తాజాగా ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 7’కు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ షో గ్రాండ్ లాంచ్ కు ముహుర్తం ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 3న బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ఎంతో గ్రాండ్ గా లాంచ్ కానున్నట్టు అధికారికం గా వెల్లడించారు.
ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ షో కోసం నాగ్ సరికొత్త లుక్ లో ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రొమోలో ‘ది ఎండ్’ అని ఇవ్వడంతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.ఇది అంతం కాదు ఆరంభం అని నాగార్జున చెప్పే డైలాగ్ ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది…అయితే, బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు.. ఆశించిన రేటింగ్ కూడా రాలేదు. దీంతో రాబోయే సీజన్ 7ను మరింత కొత్తగా డిజైన్ చేసినట్టు సమాచారం..ఈ సీజన్ లో గేమ్ రూల్స్ అలాగే కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో కూడా కొత్తగా థింక్ చేసినట్లు సమాచారం. ఎప్పటి నుంచో ఊరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ గా లాంచ్ కాబోతుందడంతో ప్రేక్షకులు ఎంతో ఆనందంగా వున్నారు.ఈ సీజన్ లో ప్రతి టాస్క్ కూడా ప్రేక్షకులకు ఎంతగానో ఆసక్తిని కలిగిస్తుందని సమాచారం.
https://twitter.com/StarMaa/status/1693238956916367763?s=20