RK Roja: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిని కూడా వదలడం లేదు.. రోజా కీలక వ్యాఖ్యలు
- తన రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిని సైతం చంద్రబాబు వదలడం లేదు
- చంద్రబాబు ఆరోపణలు సమంజసం కాదు
- నింద వేయడానికి కల్తీ నెయ్యి అంటూ ప్రచారం
- మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైసీపీ నాయకులపై దాడులు, ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చలేకపోయాడని విమర్శించారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదన్నారు చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదొకటి తెరపైకి తెచ్చి, పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజలు ఖండిస్తున్నారు, చీకొడుతున్నారని రోజా వ్యాఖ్యానించారు.
Read Also: Tirupati Laddoo Row: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థ, సీఎంకు ఎలాంటి సంబంధం ఉండదని మంత్రి లోకేష్ అంటున్నారని తెలిపారు. జగన్ అనిమల్ ఫ్యాట్ మిక్స్ చేయించినట్లుగా చంద్రబాబు సృష్టిస్తున్నారన్నారు. చంద్రబాబు ఆరోపణలు సమంజసం కాదన్నారు.ఈఓ శ్యామల రావు బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నట్లు తెలిపారని.. అనంతరం జులై 23న వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేశారు… అందుకే నెయ్యిని వెనక్కు పంపాం అంటూ ఈవో స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. రెండు నెలల అనంతరం సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నింద వేశారని పేర్కొన్నారు. మళ్లీ శ్యామలరావుపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టించారని ఆమె తెలిపారు. మీ ప్రభుత్వంలో బయటపడిన అంశం కాబట్టి బాధ్యులు ఎవరు? సీఎం చంద్రబాబునా? ఈవో శ్యామలరావునా అంటూ రోజా ప్రశ్నించారు.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో ప్రధాని మోడీ, సీజేఐలు, చంద్రబాబు సైతం ఫ్యామిలీతో రావడం జరిగిందన్నారు. లడ్డూ రుచిలో తేడా ఉంటే ఆ రోజే కంప్లైంట్ ఇవ్వాలి కదా అంటూ ప్రశ్నించారు. ఐదేళ్లలో ఏదో జరిగిందని నింద వేయడానికి కల్తీ నెయ్యి అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు సైతం గత పాలక మండలిలో ఉన్నారు… అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదని ప్రశ్నలు గుప్పించారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి, పార్థసారథి గత పాలకమండలిలో ఉన్నారు… తప్పు చేశారా లేదా వాళ్లైనా చెప్పాలన్నారు. ఈరోజు ప్రాయశ్చిత దీక్ష చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారని, ప్రాయిశ్చిత్తం ఎవరు చేస్తారని ఆమె ప్రశ్నించారు. తప్పుచేసినవారు చేస్తారు అంటే ప్రభుత్వంలో ఉన్నామని, టీడీపీ పాపంలో భాగం ఉంది కనుక దీక్ష చేస్తున్నానని ఆయనే ఒప్పుకున్నారని రోజా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!