Site icon NTV Telugu

Ambati Rambabu : నాపై తప్పుడు కేసు నమోదు చేశారు.. ఆ సీఐని వదిలి పెట్టను..!

Ambati Rambabu

Ambati Rambabu

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని.. అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్బుతమైన స్పందన లభించిందన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నించారని.. ఏడాదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను జైళ్లకు పంపించారని.. ఏడాది పాలన పండగలా నిర్వహించాలని పిలుపునిస్తే పెద్దగా స్పందన రాలేదన్నారు. ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ది తెచ్చుకోవాలని.. దోచుకునే బ్యాచ్ కే పండగ. చంద్రబాబు ఇప్పుడైనా తన పాలన గురించి ఆలోచించాలని సూచించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రెండో ఏడాది పూర్తైన సమయంలో వెన్నుపోటు2 సమయానికి‌ జనం తిరగబడొచ్చని మాజీ మంత్రి తెలిపారు.

READ MORE: Lakshmi Narasimha : రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్.. బాలయ్య సినిమాకి కొత్త సాంగ్

వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్తున్న నన్ను పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఐకి మంత్రి లోకేష్ సపోర్ట్ చేశారని.. బెదిరించి, భయపెట్టాలని చూశారన్నారు. అనివార్య పరిస్థితుల్లో ఎదురుతిరగాల్సి వచ్చిందని వెల్లడించారు. తాను చేసిన రెండు ఫిర్యాదుల గురించి అడిగితే సీఐ దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. “లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాపై కేసు నమోదు చేశారు. నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. కేసులకు నేను భయపడను… డోంట్ కేర్… న్యాయస్థానంలో తేల్చుకుంటా. సీఐని వదిలిపెట్టేది లేదు. రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవు. నాపై స్పీడుగా కేసులు పెట్టి… నా ఫిర్యాదులపై కేసు నమోదు చెయ్యలేదు. రాజకీయాల్లో ఉండాలంటే కేసులు, జైలుకెళ్లడానికి భయపడకూడదు. తుని ఘటనకు సంబంధించి జీఓ ఇచ్చారు… మళ్లీ రద్దు చేశారు. సీఎం, హోంమంత్రి, మంత్రులకు తెలియకుండా జీఓ వస్తుందా? రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ తగలబెట్టిన కేసుపై ఎవరికీ తెలియకుండా జీఓ వచ్చిందంటే ఎలా చూడాలి. రాష్ట్రంలో ఏడాదిలోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదు. పోలీసులను అడ్డంపెట్టుకుని పరిపాలన చెయ్యడమే తప్ప మంచి పాలన చెయ్యలేవు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పేషీలో పనిచేసిన ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు. జగన్ ను మీరు అనుకున్నా అరెస్ట్ చెయ్యలేరు. రాష్ట్రంలో ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న మాస్ లీడర్ జగన్. డీజీపీకి ఇప్పటికి యాభైసార్లు ఫోన్ చేశా… కానీ ఆయన స్పందించరు. నా ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. న్యాయస్థానాలు తప్ప మాకు వేరే గత్యంతరం లేదు. రాష్ట్రంలో పోలీసింగ్ ఉందా. వంగవీటి రంగా హత్య తరహాలో పోలీసులు హత్య కూడా చేయిస్తారేమో.. ఇది రాబోయేకాలంలో ప్రమాదకరంగా మారొచ్చు. పోలీసులు టీడీపీ గూండాల్లా పనిచేస్తున్నారు. మంచి పోలీసులు లూప్ లైన్ లో ఉన్నారు.” అని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

READ MORE: PV Sindhu: ఇండోనేషియా ఓపెన్‌ సూపర్ 1000 నుంచి పీవీ సింధు అవుట్..!

Exit mobile version