AP Excise Suraksha App: నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకువచ్చినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో నకిలీ మద్యం ఒకటని అన్నారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఏరులై పారించిందని, దానిని లీగలైజ్ చేసిందని విమర్శించారు. గత పాలకులు గంజాయిని వాణిజ్య పంటగా భావించి పండించారు, సరఫరా చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను ప్రక్షాళన చేయడం ప్రారంభించిందని…
ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్.ఆర్.ఐ. జన సైనికులు, వీర మహిళలతో వర్చువల్ సమావేశంలో శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి పాలన ప్రజలకు చేరువైందన్న ఆయన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి రూ.308 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల కోసం…
Narayana Swamy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలను కూటమి ప్రభుత్వం అరికట్టలేకపోతున్నదంటూ చిత్తూరులో వైస్సార్సీపీ మహిళా విభాగం నేతలు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరు చూస్తుంటే మనం భారతదేశంలో ఉన్నామా..? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా..? అన్న అనుమానం కలుగుతోంది. ఏపీలో ప్రజలు నార్త్ కొరియా తరహా పాలనను అనుభవిస్తున్నారని తీవ్రస్థాయిలో…
Devineni Avinash: ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది గడుస్తున్నా, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ సందర్బంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండాల్సింది. కానీ, అవి కేవలం ఓటు కోసం చెప్పిన వాగ్దానాలుగానే మిగిలిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా…
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని.. అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్బుతమైన స్పందన లభించిందన్నారు.
IIT Madras : సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఏపి ప్రభుత్వంతో కలసి పనిచేయాలని ఐఐటి మద్రాసు నిర్ణయించింది. ఐఐటిఎం ప్రతినిధులతో ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. సాయంత్రం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసు, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడం, పరిశోధన, శిక్షణ, సాంకేతికతలో రాష్ట్రం ముందుకు పోవడానికి దోహదం చేస్తాయి. 1.…