Oneplus Store : హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉన్న వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్‌లో ఫోన్ రిపేర్ కోసం వచ్చిన కస్టమర్లకు ఎదురైన అనుభవం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సర్వీస్ సెంటర్ సిబ్బందితో పాటు నారాయణగూడ పోలీసులు కస్టమర్లపై దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కస్టమర్లు తమ ఫోన్‌లను రిపేర్ చేయించేందుకు సర్వీస్ సెంటర్‌కు వెళ్లగా, రెండు నెలలు గడిచినా ఫోన్‌లను తిరిగి అందజేయలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సర్వీస్ సెంటర్ మేనేజర్‌ను ప్రశ్నించిన కస్టమర్లతో వాగ్వాదం చోటుచేసుకుంది.…
పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని.. ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మాజీ ప్రభుత్వ విప్, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది కిందట ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి ద్వారా ఎనిమిది కోట్లు పట్టుకున్నట్టు తెలిసిందని.. తనిఖీల్లో 8 కోట్ల రూపాయలు దొరికితే, దానికి అన్ని ఆధారాలు సమర్పించారన్నారు.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని.. అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్బుతమైన స్పందన లభించిందన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేష్ యాదవ్ మంగళవారం సంభాల్, ఔరంగజేబు సమస్యలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అధికార బీజేపీ పార్టీ మతపరమైన ప్రదేశాలను ప్రమాదంలో పడేస్తోందని, మతపరమైన ఉద్రిక్తతను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సంభాల్, ఔరంగజేబు వంటి అంశాలను లేవనెత్తుతుందని అఖిలేష్ యాదవ్ అన్నారు.
Physical Harassment : సమాజంలో ఎక్కడ అన్యాయాలు లేదా అక్రమాలు జరిగితే, పాపం ఎవరైనా ఆందోళన చెందితే, వారంతా పోలీసులను ఆశ్రయిస్తుంటారు. పోలీసు ఉద్యోగం అనేది చాలా మందికి ఒక గొప్ప అవకశంగా కనిపిస్తుంటుంది. సమాజంలో చాలామంది ఖాకీ యూనిఫాంలో సేవలు అందించాలని, పోలీసు అవ్వాలని ఆసక్తితో ఎదురు చూస్తారు. కానీ కొంతమంది మాత్రమే ఈ స్వప్నాన్ని సాకారం చేసుకుంటారు. పోలీసు ఉద్యోగం సాధించడం ఒక పెద్ద పోటీగా మారింది. అయితే, ఆ గొప్ప ఉద్యోగాన్ని సాధించిన…