PV Sindhu: ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో రెండు ఒలంపిక్స్ పథకాల విజేత భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోటీ నుంచి నిష్క్రమించింది. నేడు (మే 5) జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో థాయ్‌లాండ్ కు చెందిన వరల్డ్ నంబర్ 8 పోరన్ పావీ చోచువాంగ్ చేతిలో ఓటమి పాలైంది. మొత్తం 78 నిమిషాలు పాటు సాగిన ఆట.. మూడు గేమ్‌ల పాటు సాగిన ఈ ఉత్కంఠభరిత పోరులో సింధు 22-20, 10-21, 18-21తో ఓడిపోయింది. మూడో గేమ్‌లో 15-11తో ముందంజలో ఉన్న సింధు గేమ్‌ను గెలుస్తుందని అనిపించింది. కానీ నిర్ణయాత్మకమైన సమయంలో చేసిన వరుస తప్పిదాలతో విజయం చేజార్చుకుంది.
ఇక ఈ సంబంధించి సింధు మాట్లాడుతూ.. నిజంగా ఈ మ్యాచ్‌ను గెలిచివుండాల్సింది. మూడో గేమ్‌లో 16-13కి ముందున్నప్పుడు నన్నే విజేత అనుకున్నాను. కానీ, ఆ తర్వాత కొద్దిగా వేగంగా సాగడం వల్ల గేమ్‌ను కంట్రోల్ చేయడంలో కష్టపడ్డానని మ్యాచ్ అనంతరం తెలిపింది. మ్యాచ్ 18-18 సమాన స్థాయి ఉన్న సమయంలో ఎవరి గేమ్ అయినా కావచ్చు.. కానీ నేనే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను.. అయినా, కూడా నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానని తేలిపోయింది. ఈ మ్యాచ్, టోర్నమెంట్ నుండి చాలా విషయాలు నేర్చుకున్నానని, తర్వాతి టోర్నీల కోసం సిద్ధమవుతానని సింధు అన్నారు.
Read Also: Sharmishta Panoli: ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి మధ్యంతర బెయిల్ మంజూరు..!
మొదటి గేమ్‌లో 10-16 తేడాతో వెనుకబడినప్పటికీ అద్భుతంగా పుంజుకుని గేమ్‌ను 22-20తో గెలిచిన సింధు, తదుపరి గేమ్‌లలో మాత్రం పూర్తిగా పేలవమైన తీరు కనబరిచింది. మూడో గేమ్‌లో తనదైన ఆట తీరు చూపించినప్పటికీ, చివరి దశలో ఆమె చేసిన నాలుగు తప్పుల కారణంగా ప్రత్యర్థి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.