Birender Singh: కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బీరేందర్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ హర్యానాలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ బీజేపీకి షాకిచ్చారు. కమలం పార్టీకి గుడ్‌బై చెప్పి హస్తం గూటికి చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో బీరేందర్ సింగ్‌కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ఆయన భార్య ప్రేమ్‌లత కూడా కాంగ్రెస్‌లో చేరారు.
నెలరోజుల క్రితమే బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్ లోక్‌సభకు రాజీనామా చేసి.. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానాలో బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించిన బీరేందర్ సింగ్ భార్య ప్రేమ్‌లత సైతం బీజేపీకి రాజీనామా చేశారు.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు బీరేందర్ సింగ్ సోమవారం ప్రకటించారు. తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపినట్లు తెలిపారు. 2014-2019 వరకూ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న తన భార్య ప్రేమ్ లత సైతం పార్టీని వీడారని చెప్పారు. గతంలో నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌తో సంబంధాలు సాగించిన బీరేందర్ సింగ్ పదేళ్ల క్రితం బీజేపీలో చేరారు.
ఇది కూడా చదవండి: Ramesh Kumar Reddy Resigns: టీడీపీకి మరో షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
బీరేందర్, బ్రిజేందర్ సింగ్‌లు గతంలోనూ పలు అంశాల్లో బీజేపీతో విభేదించారు. 2020లో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ రైతులు చేసిన డిమాండ్‌కు వీరు మద్దతు పలికారు. లైంగింక వేధింపులు ఎదుర్కొన్న మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేసిన ఆందోళనకు సైతం మద్దతు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Mahesh Babu-Venkatesh: చిన్నోడితో కలిసి పెద్దోడి బిజినెస్.. ‘ఏఎంబీ విక్టరీగా’ థియేటర్!
ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం అవుతోంది. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. కాగా హర్యానా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో మే 25న జరుగనున్నాయి.
ఇది కూడా చదవండి: MLC Kavitha: లిక్కర్ కేసులో బాధితురాలిని.. తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ
#WATCH | Former BJP leaders Chaudhry Birender Singh and his wife Premlata Singh join the Congress Party, in Delhi
Their son and former BJP leader Brijendra Singh had joined the Congress Party recently. pic.twitter.com/cV0EGeOtoW
— ANI (@ANI) April 9, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!