Honor X6e Launched: 7,500mAh బ్యాటరీ, TFT LCD స్క్రీన్, 4GB ర్యామ్+ 128GB స్టోరేజ్ రూ.16 వేలకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆనర్ (Honor) కంపెనీ కొత్తగా Honor X6e స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. 4G కనెక్టివిటీతో వస్తున్న ఈ బడ్జెట్ ఫోన్ ధరకు తగ్గట్టుగా ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తోంది. డిజైన్, డిస్ప్లే విషయానికొస్తే.. ఇందులో 6.61-అంగుళాల TFT LCD స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1010 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు కళ్ళకు రక్షణనిచ్చే ‘ఐ కంఫర్ట్’, ‘డైనమిక్ డిమ్మింగ్’ సాంకేతికతలను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ గీతలు పడకుండా ‘అలుమినోసిలికేట్’ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. అలాగే దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్, పడిపోయినా తట్టుకునేలా SGS డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా పొందింది.
ఫోన్ మీడియాటెక్ హీలియో G81 ఆల్ట్రా ప్రొసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్OS 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది రన్ అవుతుంది. ఇందులో 4GBర్యామ్, 128GB స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ద్వారా ర్యామ్‌ను 8GB వరకు విస్తరించుకోవచ్చు. కెమెరా విభాగంలో, వెనుకవైపు 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు సెకండరీ సెన్సార్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
Also Read
- 990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
- JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
ఈ స్మార్ట్‌ఫోన్‌లోని అతిపెద్ద ఆకర్షణ దీని 7,500mAh భారీ బ్యాటరీ. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఇందులో వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ, సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ప్రాథమిక ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం మలేషియాలో లాంచ్ అయిన Honor X6e (4GB + 128GB) మోడల్ ధర RM 699 గా ఉంది (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.16,000). ఇది సన్‌రైజ్ గోల్డ్, మిడ్నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
తాజావార్తలు
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
Small Budjet Movies : చిన్న బడ్జెట్ సినిమాలకు రొమాన్స్, బోల్డ్, ఇంటిమేట్ సీన్స్నే సేఫ్ ఫార్ములాగా భావిస్తున్నారా?
-
Horror Spell: టీమిండియా స్టార్ పేసర్‌ను పొట్టుపొట్టు కొట్టిన లోకల్ ప్లేయర్స్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే!
-
AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
-
Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
ట్రెండింగ్
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!