LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ మొబైల్‌కు ‘మీ LPG కనెక్షన్ నిలిపివేయబడుతుంది’, ‘వెంటనే KYC అప్డేట్ చేయండి లేదా గ్యాస్ సబ్సిడీ ఆపివేయబడింది అని సందేశం వస్తే.. దానిని పరిశీలించకుండా గుడ్డిగా నమ్మడం చాలా ప్రమాదకరం. దేశవ్యాప్తంగా LPG సేవలకు సంబంధించి ఆన్లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ICICI బ్యాంక్ తన వినియోగదారులకు ఒక ప్రత్యేక హెచ్చరికను జారీ చేసింది. సైబర్ నేరగాళ్ళు గ్యాస్ కనెక్షన్, LPG సబ్సిడీ, KYC అప్డేట్ వంటి అత్యవసర సేవల పేరుతో భయాందోళనలు సృష్టిస్తూ, ప్రజలను నకిలీ లింక్‌లపై క్లిక్ చేసేలా ప్రేరేపిస్తున్నారని బ్యాంక్ తెలిపింది. ఇటువంటి కేసులలో, ప్రజలు తెలియక నకిలీ వెబ్సైట్లలో తమ బ్యాంకింగ్ వివరాలు, OTP లేదా UPI PIN నమోదు చేసి, తమ ఖాతాల నుంచి డబ్బును కోల్పోతున్నారు.
ఈ మోసగాళ్ళు SMS, WhatsApp, Telegram లేదా నేరుగా ఫోన్ కాల్స్ ద్వారా గ్యాస్ ఏజెన్సీలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లేదా ప్రభుత్వ అధికారులమని చెప్పుకుంటూ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ స్కామ్ సాధారణంగా ఒక మెసేజ్ లేదా కాల్‌తో ప్రారంభమవుతుంది. మీ గ్యాస్ కనెక్షన్ 24 గంటల్లో నిలిపివేయబడుతుందని భయపెడుతూ, ఒక నకిలీ లింక్‌ను పంపుతారు. వినియోగదారుడు ఆ లింక్‌పై క్లిక్ చేయగానే వ్యక్తిగత వివరాలను నమోదు చేయమని లేదా ఏదైనా APK ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోమని, QR కోడ్‌ను స్కాన్ చేయమని అడుగుతారు. ఈ ప్రక్రియలో మోసగాళ్లు OTP, UPI PIN లేదా బ్యాంకింగ్ వివరాలు సేకరించి ఖాతాలోని సొమ్మును తస్కరిస్తారు.
Also Read
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ ల పట్ల తక్షణమే స్పందించాలని ఒత్తిడి చేయడం, తెలియని లింక్‌లపై క్లిక్ చేయమని అడగడం, APK ఫైళ్లు లేదా QR కోడ్లను ఉపయోగించమనడం, OTP లేదా PIN అడగడం వంటి సంకేతాలు కనిపించినప్పుడు అది నకిలీ సందేశంగా అనుమానించాలి. ఈ తరహా మోసాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి LPG బుకింగ్, KYC లేదా సబ్సిడీకి సంబంధించిన పనుల కోసం కేవలం అధికారిక వెబ్సైట్లు లేదా మొబైల్ యాప్‌లను మాత్రమే ఉపయోగించండి. ఏ బ్యాంక్, గ్యాస్ ఏజెన్సీ లేదా ప్రభుత్వ శాఖ ఫోన్ లేదా మెసేజ్‌ల ద్వారా OTP లేదా PIN వివరాలను అడగవని గుర్తుంచుకోండి. గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ కాకుండా ఏ యాప్‌లను మీ మొబైల్లో డౌన్లోడ్ చేయకూడదు.
తాజావార్తలు
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?