Mahesh Babu-Venkatesh: చిన్నోడితో కలిసి పెద్దోడి బిజినెస్.. ‘ఏఎంబీ విక్టరీగా’ థియేటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu-Venkatesh Theatre: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న ‘సుదర్శన్’ థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద హీరో సినిమా రిలీజ్ ఉందంటే.. అక్కడ పండుగ వాతావరణం ఉంటుంది. భారీ కటౌట్లు, వందల కొద్ది ఫెక్సీలు, పాలాభిషేకాలతో ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి, ఆయన ఫ్యాన్స్‌కి సుదర్శన్ థియేటర్ చాలా సెంటిమెంట్. తన సినిమా మొదటి షోను ఫ్యాన్స్‌తో కలిసి మహేష్ బాబు సుదర్శన్‌లోనే చూస్తారు. ఇటీవల వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాకు సెలబ్రేషన్స్‌ను ఫ్యాన్స్ వీరలెవల్లో చేశారు. ఈ సెలబ్రేషన్స్ రానున్న రోజుల్లో మరింత ఎక్కువ కానున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.
Also Read: Chiranjeevi vs Ravi Teja: చిరంజీవి వర్సెస్ రవితేజ.. గెలుపు ఎవరిదో!
Also Read
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
2010లో అనివార్య కారణాల వల్ల సుదర్శన్ 70MM మూతపడింది. ఇప్పుడు దానిని మహేశ్ బాబు రీఓపెన్ చేస్తున్నారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఎంబీ పేరుతో 7 స్క్రీన్స్ ఉండేలా సూపర్ స్టార్ భారీ మల్టీఫ్లెక్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బిల్డింగ్ వర్క్ పూర్తయింది. అయితే ఈ థియేటర్ బిజినెస్‌లోకి తాజాగా విక్టరీ వెంకటేష్ కూడా వచ్చారట. దాంతో సుదర్శన్ థియేటర్‌కు ‘ఏఎంబీ విక్టరీగా’ పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ వార్త తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘చిన్నోడితో కలిసి పెద్దోడి బిజినెస్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!