Stock Markets India: వారంలో మూడవ ట్రేడింగ్ రోజైన బుధవారం నాడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సంబంధించిన 30 షేర్ల సెన్సెక్స్ విలువ నిన్నటి రోజు ముగింపుతో పోలిస్తే.. 295 పాయింట్ల పెరుగుదలతో 79771 స్థాయి వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 24308.75 స్థాయి వద్ద భారీ పెరుగుదలతో ట్రేడింగ్ ప్రారంభించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కారణంగా గ్లోబల్ మార్కెట్ బూమ్ ప్రభావం భారత మార్కెట్ పై కూడా కనిపిస్తోంది. బిఎస్‌ఇ సెన్సెక్స్ మంగళవారం ముగింపు స్థాయి 79,476.63 నుండి 295 పాయింట్లు పెరిగి 79,771.82 వద్ద ప్రారంభమైంది.
Read Also: US Election Results: అమెరికా మినీ ఇండియాలో భారతీయులు ఎవరికి పట్టం కట్టనున్నారంటే?
ఐకమరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా మంగళవారం 24,213.30 వద్ద ముగియగా.. నేడు 24,308.75 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌లో ఈ పెరుగుదల ప్రభావం ప్రీ-ఓపెనింగ్ సెషన్‌లో కూడా కనిపించింది. ఉదయం 9.15 గంటలకు స్టాక్ మార్కెట్ ప్రారంభమైనప్పుడు, 30 బిఎస్‌ఇ లార్జ్‌క్యాప్ స్టాక్‌లలో 22 బలమైన లాభాలను చవిచూశాయి. 8 షేర్లు నష్టాలలో ప్రారంభమయ్యాయి.
Read Also: US Elections 2024: ఉత్కంఠగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఆ రోజే ఫైనల్ రిజల్ట్!
అమెరికాలో జరిగే ఏ విషయమైనా సరే.. ఎన్నికలపైనా లేదా అమెరికా ఫెడ్ నిర్ణయాల గురించి అయినా భారతీయ మార్కెట్‌పై కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతాయి. ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే, భారత స్టాక్ మార్కెట్‌లో ర్యాలీని చూడవచ్చని గ్లోబల్ బ్రోకరేజ్‌లు ఇప్పటికే అంచనా వేస్తున్నాయి. ఎన్నికల ఫలితాల్లో కూడా ఇలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆధిక్యత కారణంగా, స్టాక్ మార్కెట్ కూడా బలంగా ప్రారంభమైంది. చుడాలిమరి అమెరికా ఎన్నికల ఫలితాలు ఏవిధంగా భారతీయ స్టాక్ మార్కెట్స్ పై ప్రభావం చూపుతాయో.