US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్ట్ ట్రంప్, కమలా హ్యారీస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఒక పక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరో పక్క ఫలితాల కౌంటింగ్‌ను స్టార్ట్ చేశారు. ఇక, భారత కాలమాన ప్రకారం ఇవాళ (బుధవారం) ఉదయం 11.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. దీంతో పోలింగ్ పూర్తైన కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల వరకు సాగిన కౌంటింగ్‌లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు.
Read Also: KTR Tweet: కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు.. కేటీఆర్ ట్వీట్ వైరల్..
ప్రస్తుతానికి 19 రాష్ట్రాలలో ట్రంప్ విజయం సాధించారు. ఇండియానా, కెంటకీ, వెస్ట్ వర్జీనియా, మిస్సౌరి, ఫ్లోరిడా, మిస్సిసిప్పి, సౌత్ కరోలినా, టెన్నెసీ, అలబామా, ఓక్లహామాలో ట్రంప్ గెలిచారు. దీంతో ట్రంప్‌కు 198 ఎలక్టోరల్ సీట్లు లభించాయి. ఇక కమలా హ్యారీస్ సైతం 8 రాష్ట్రాల్లో ఆధిక్యం కనబరిచారు. మేరీలాండ్, మస్సాచుసెట్స్, కనెక్టికట్, న్యూజెర్సీ, రోడ్ ఐలాండ్, వెర్మాంట్‌లో కమల విజయం సాధించాగా.. దీంతో కమలకు 109 ఎలక్టోరల్ సీట్లు లభించాయి.
Read Also: Josh Inglis: కొత్త వన్డే, టీ20 కెప్టెన్‌ని ప్రకటించిన ఆస్ట్రేలియా
అయితే, భారత్‌లా అమెరికాలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ లాంటిది ఏమీ ఉండదు. ఆయా రాష్ర్టాలే ఎన్నికలను నిర్వహిస్తాయి. ఎన్నికల కౌంటింగ్ పూర్తి చేసి ప్రకటించేందుకు డిసెంబరు 11వ తేదీ వరకు సమయం ఉంది. అధికారికంగా ఫలితాలు వెలువడేందుకు సమయం పట్టే ఛాన్స్ ఉన్నప్పటికీ ముందుగా మీడియా సంస్థలు నాలుగైదు రోజుల్లో ఫలితాలను అంచనా వేసే అవకాశం ఉంది.