కుర్చీని మడత పెట్టడం మనం చూసే ఉంటాం.. కానీ మడత పెట్టే ఇంటి గురించి ఎప్పుడైనా విన్నారా?.. ఏంటి అలాంటి ఇల్లు కూడా ఒకటి ఉందా అనే సందేహం వస్తుంది కదూ.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. అలాంటి ఇల్లు కూడా ఒకటి ఉంది.. చిన్న వయసు నుంచే తమకు ఇలాంటి ఇళ్లు కావాలో ప్లాన్లు వేస్తూ వుంటారు. డ్రీమ్ హౌస్ కోసం ఎంతగానో కష్టపడుతూ వుంటారు.. ఇప్పుడు మామూలు ఇళ్లను కొనాలి అంటే చాలా కష్టం.. ఎందుకంటే అవి లక్షల్లో ఉంటాయి.. ఇంకా బాగా కావాలంటే కోట్లు కూడా పెట్టాలి..
ఇలాంటి వాటి నుంచి బయట పడేందుకు చాలా మంది రకాలుగా ఇంటిని నిర్మిస్తు ఉంటారు.. మనం నిత్యం ఇలాంటివి వార్తల్లో చూస్తూనే ఉంటాం.. అయితే ఇప్పుడు మడత పెట్టే ఇల్లు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అమెరికాకు చెందిన 23 ఏళ్ల టిక్‌టాకర్ అమెజాన్ నుంచి కొనుగోలు చేసిన ఇంటిని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. లాస్ ఏంజెల్స్ నగరానికి చెందిన జెఫ్రీ బ్రయంట్ టిక్‌టాక్‌లో పంచుకున్న ఈ వీడియో వైరల్‌గా మారింది…
ఆ ఇంటి ధర అక్షరాల రూ. 21 లక్షలకు పైనే ఉంటుంది.. 16.5 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవున్న ఈ ఇల్లు ప్రత్యేకత ఏంటో తెలుసో.. ఫోల్డ్ చేయడం. ఈ చిన్న ఫ్లాట్‌లో షవర్, టాయిలెట్, కిచెన్, లివింగ్ ఏరియా, బెడ్ రూమ్ వున్నాయి. బ్రయంట్ మాత్రమే కాదు.. పెరుగుతున్న అద్దెలు, అడ్వాన్స్‌లకు ప్రత్యామ్నాయంగా చాలా మంది వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఇలాంటి చిన్న ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు.. ఈ ఇంటి వీడియో వైరల్ అవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియోను ఒక్కసారి చూసేయ్యండి..
Yeah nah ion trust a foldable house https://t.co/tpJx82wq3a
— KnightStar (@kn1ghtglow) February 6, 2024