Fair Accident: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలోని అశోక్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫుట్ వేర్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఫుట్ వేర్ షాపు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటా హుటిన ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. షాప్ యజమానికి సమాచారం ఇచ్చారు. అయితే రాత్రి ఒంటి గంట సమయంలో మంటలు చలరేగడంతో స్థానికుల భయాందోళనకు గురయ్యారు. షాప్ పైన కూడా ఇండ్లు ఉండటంతో పైన వున్న కుంటుంబాలను అక్కడి నుంచి వేరే చోటుకు మార్చారు. అయితే విద్యుత్ షాక్ తో అగ్నిప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే షాప్ లో ఎవరు లేకపోడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
Read also: Allu Arjun : ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనీ ఉంది.. కానీ..?
అయితే అర్ధరాత్రి ఒక్కసారి మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనతో బయటకు పరుగులు పెట్టారు. అయితే పక్కనే ఫుట్ వేర్ షాపులో మంటలు ఎగిసిపడుతుండటంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన.. ఇంట్లోనుంచి నీళ్లను తీసుకుని వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే కొద్ది సమయంలోనే ఫైర్ సిబ్బంది రావడంతో సిబ్బందితో పాటు స్థానికులు కూడా మంటలను అదుపుచేసే పని పడ్డారు. తెల్లవారేంత వరకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుత్ షాక్ వల్లే మంటలు చెలరేగాయా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Aravind Kejriwal : కాంగ్రెస్‌కు మద్దతుగా కేజ్రీవాల్ రోడ్ షో.. వాషింగ్ మెషీన్ ప్రచారం