Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2” .క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కింది.ఆగస్ట్ 15న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన పోస్టర్స్ ,టీజర్ ,సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప’ చిత్రంలో తాను పోషించిన స్మగ్లర్ పుష్పరాజ్ పాత్ర గురించి అల్లు అర్జున్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.పుష్ప సినిమాలో స్మగ్లర్ పాత్ర అంటే ప్రేక్షకులు నెగటివ్ కోణంలో చూస్తారని భావించారు.కానీ తన పాత్ర ప్రభావం మాత్రం ప్రేక్షకులపై పడలేదని అల్లు అర్జున్ తెలిపారు.
సుకుమార్ ఈ సినిమా కథ చెబుతూ స్మగ్లర్ పాత్ర అనగానే నేను అంతగా కంగారు పడలేదు.ప్రేక్షకుల ఆలోచన శైలి మారింది.సినిమాలని సినిమాలాగే చూస్తారని సీరియస్ గా తీసుకోరని నేను భావించాను.అయిన కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ ఇప్పుడు బాగా తగ్గింది.అందుకే నా పాత్ర ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపించాడు అని అనుకున్నాకే ఈ సినిమా చేయడం జరిగిందని అల్లు అర్జున్ తెలిపారు.నాకు ఎప్పుడు ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనీ ఉంటుంది.కానీ ‘పుష్ప’ వంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇప్పటివరకు అస్సలు రాలేదని అల్లు అర్జున్ తెలిపారు.