నాంపల్లి బజార్ ఘాట్ ప్రమాదంపై అగ్నిమాపక శాఖ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. భవనంలో సేఫ్టీ లేదని ఫైర్ శాఖ వెల్లడించింది. అయితే, కెమికల్ డ్రమ్స్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించింది. అయితే, ఇవాళ ఉదయం 9:30 గంటలకు ప్రమాదం చోటు చేసుకుంది.. మొత్తం 21 మందిని అగ్ని ప్రమాదంలో కాపాడం.. 9 మంది చనిపోయారు.. సెల్లార్ లో ప్లాస్టిక్ డ్రమ్ములు అక్రమంగా పెట్టారు అని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు.
Read Also: Akkineni Venkat: ఆస్తి పంపకాలు.. నాగార్జునతో గొడవలు.. అన్న వెంకట్ ఏమన్నాడంటే..?
అగ్ని ప్రమాదానికి కారణాల పై దర్యాప్తు చేస్తున్నామని ఫైర్ శాఖ అధికారులు తెలిపారు. బిల్డింగ్ లో మొత్తం 16 ఇల్లులు ఉన్నాయి.. బిల్డింగ్ కి ఎలాంటి సెట్ బ్యాక్ లేదు.. బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ అసలే లేదు.. సెల్లార్ ను పార్కింగ్ కోసం వినియోగించాలి కానీ కెమికల్ డ్రమ్స్ పెట్టారు.. పాలిస్టర్ రెసిన్, బ్యానర్ లకు వాడే సామాగ్రి, కెమికల్స్ ను డంపు చేశారు అని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు.
Read Also: MLC Jeevan Reddy: తెలంగాణలో కాంగ్రెస్ 70కి పైగా స్థానాల్లో గెలుస్తుంది
ఇవాళ ఉదయం ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కెమికల్ నిల్వలను రమేష్ జైశ్వాల్ అనే వ్యక్తి నిల్వ చేసినట్లు తేలింది. అయితే, పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నిల్వ ఉంచి అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో వ్యాపారం చేస్తున్నాడని ఫైర్ శాఖ అధికారులు చెప్పారు. ఇక, ఇది చాలారోజులుగా నడుస్తున్న వ్యవహారమని అధికారుల అన్నారు. భారీగా కెమికల్ నిల్వలు ఉంచినప్పుడు తమకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అపార్ట్‌మెంట్ వాసులను అగ్నిమాపక శాఖ అధికారులు ప్రశ్నించారు. దీంతో స్థానికులు ఆ ప్రశ్నలకు సైలెంట్ అయ్యారు. మరోవైపు తనిఖీలు చేపట్టని విజిలెన్స్ అధికారులు, సేఫ్టీ పరిశీలనలో విఫలమైన జీహెచ్‌ఎంసీ తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.