షేక్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జుహి ఫెర్టిలిటీ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న ఆకాష్ స్టడీ సెంటర్‌కి మంటలు వ్యాపించాయి. అదే బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్‌కు మంటలు అంటుకున్నాయి. దాంతో గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఓవైపు భారీగా మంటలు ఎగిసిపడుతుంటే.. మరోవైపు దట్టమైన పొగ అలుముకుంది.
Also Read: Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థినిపై యువకుడు అత్యాచారం!
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. భారీ పొగ కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంతో రిలయన్స్ ట్రెండ్స్ అద్దాలు బ్రేక్ చేసి.. లోపలికి వెళ్లేందుకు ఫైర్ ఫైటర్స్ ప్రయత్నం చేస్తున్నారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల బిల్డింగ్ వారు బయటికి పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్థి నష్టంకు సంబందించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఫైర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.