Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థినిపై యువకుడు అత్యాచారం!
- ఇబ్రహీంపట్నంలో దారుణం
- ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం
- యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ వసతిగృహంలో ఉంటున్న ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థిని కేకలు విన్న పక్క గదిలోని నలుగురు విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని ఇబ్రహీంపట్నం మండలంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. విద్యార్థిని మంగల్‌పల్లి గేట్ వద్ద ఓ స్థిరాస్తి వ్యాపారికి చెందిన ప్రైవేట్ వసతి గృహంలో ఉంటోంది. వసతి గృహం కింద స్థిరాస్తి ఆఫీస్ ఉండగా.. పై అంతస్తులో బాలికల వసతిగృహం ఉంది. చివరి అంతస్తులో బుధవారం రాత్రి వ్యాపారి స్నేహితుడి జన్మదిన వేడుకలు జరిగాయి. రాత్రి 11 గంటల సమయంలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జోన్నాయిచింతకు చెందిన అజిత్ (22) వసతి గృహంలో ఒంటరిగా ఉంటున్న విద్యార్థిని గదిలోకి వెళ్లి అత్యాచారం చేశాడు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Also Read: Road Accident: చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి, 13 మందికి గాయాలు!
విద్యార్థిని గట్టిగా కేకలు వేయడం పక్క గదిలోని వారికి వినిపించాయి. పక్క గదిలోని నలుగురు విద్యార్థులు తలుపునకు గడియ పెట్టి.. 100కు ఫోన్ చేశారు. పోలీసులు హుటాహుటిన వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అజిత్‌పై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. అజిత్ గతంలో వసతిగృహం యజమాని వద్ద కారు డ్రైవర్‌గా పని చేశాడని, వసతి గృహంలో సైతం ఉండేవాడని తెలిసింది. స్థిరాస్తి వ్యాపారిని కూడా పోలీసులు విచారించారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..