Best 5G smartphones: రూ. 10 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ఇవే!
- రూ. 10 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్స్
- అడ్వాన్డ్స్ ఫీచర్లు
- తక్కువ ధరలో బ్రాండెడ్ ఫోన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5జీ స్మార్ట్ ఫోన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో మొబైల్ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి. అయితే మంచి ఫీచర్లు ఉన్న 5జీ ఫోన్ కావాలంటే 15 వేల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో 5జీ స్మార్ట్ ఫోన్ ధరలు దిగొస్తున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరలోనే మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. మరి మీరు ఈ మధ్య కాలంలో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? రూ. 10 వేల లోపే బెస్ట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే రూ. 10 వేల లోపే లభించే 5జీ స్మార్ట్ ఫోన్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం.
Redmi A4 5G:
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
- Smart Phone Prices: ఇకపై స్మార్ట్‌ఫోన్‌లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
- Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇటీవల Redmi A4 5G స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. రూ. 8299కే రెడ్ మీ 5G ఫోన్ ను అందిస్తోంది. బడ్జెట్ ధరలో ఈ కొత్త 5G ఫోన్ డిజైన్, ఫీచర్లు కస్టమర్లను ఆకర్షిస్తోంది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ కావాలనుకునే వారికి Redmi A4 5G ఫోన్ బెస్ట్ ఆప్సన్ గా చెప్పొచ్చు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నది. దీని 4GB + 64GB వేరియంట్ ధర రూ. 8299గా కంపెనీ నిర్ణయించింది. 4GB + 128GB వేరియంట్ ధర రూ. 9,499గా ఉంది.
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. Redmi A4 5G స్మార్ట్‌ఫోన్ 6.88 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది.ఈ ఫోన్ Snapdragon 4S Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. Redmi A4 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ స్లాట్ అందించబడింది. ఇది ఆండ్రాయిడ్ 14OSలో నడుస్తుంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన ప్రైమరీ కెమెరా అందించారు. ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇంకా ఈ ఫోన్‌లో సైడ్‌మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్ తో 5160mAh బ్యాటరీ సామార్ధ్యాన్ని కలిగి ఉంది.
Moto G45
ఇటీవల మోటరోలా కంపెనీ మెటో జీ45 5జీ పేరిట కొత్త మొబైల్ ను తీసుకొచ్చింది. మోటో జీ45 5జీ రెండు వేరియంట్లో లభిస్తుంది. 4జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.10,999కాగా.. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది. బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్, వివా మెజెంటా కలర్ ఆప్షన్లలో లభించనుంది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే వస్తోంది. ఇందులో 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14తో పనిచేస్తుంది. వెనకవైపు 50 ఎంపీ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్, ముందువైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అయితే ఈ మొబైల్ ను బ్యాంకు ఆఫర్లను యూజ్ చేసి కొనుగోలు చేసినట్లైతే రూ. 10 వేల లోపే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.
iQOO Z9 Lite 5G
ఐక్యూ మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. రూ. 10 వేల లోపు ధరకే 5జీ ఫోన్లను అందిస్తున్నది. ఐక్యూ నుంచి iQOO Z9 Lite 5G రూ. 10 వేల 499కే వచ్చేస్తోంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఐక్యూ Z9 లైట్ 6.56-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 6ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14లో రన్ అవుతుంది. ఐక్యూ Z9 లైట్ 5జీ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ 64 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. 50 ఎంపీ సోనీ ఏఐ కెమెరాతో వస్తుంది.
Realme C63 5G
రూ. 10 వేల ధరలో బెస్ట్ 5జీ మొబైల్ కావాలనుకుంటే రియల్ మీ సీ 63 5జీపై ఓ లుక్కేయండి. ఇది 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ. 10,400గా ఉంది. రియల్ మీ సీ63 5జీ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6100 5జీ చిప్‌తో వస్తుంది. 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ 10వాట్ వైర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక 32ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ముందు భాగంలో, రియల్‌మి సీ63 5జీ కి 8ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చబడి ఉంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!