వరంగల్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన కేఎంసీ పీ.జీ వైద్య విద్యార్ధిని ప్రీతి మృతి చెందింది. అయితే.. రాష్ట్రంలో ర్యాగింగ్ విష సంస్కృతికి నిరసనగా సోమవారం మెడికల్ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది ఏబీవీపీ తెలంగాణ శాఖ. అయితే.. ఈ విషయాన్ని ఏబీవీపీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ప్రవీణ్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొ్న్నారు. ఈ సందర్బంగా ప్రీతి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నంపై.. వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్ సాధారణమని ప్రకటించిన అధికారులను సస్పెండ్ చేయాలన్నారు.
Aslo Read : Director Lakshmi Dheeptha: నటుడిని బలవంతం చేసిన మహిళా డైరెక్టర్.. అరెస్ట్ చేసిన పోలీసులు
ఇదిలా ఉంటే.. నేడు ప్రీతి స్వగ్రామం గిర్నితండాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రీతి మృతితో ఆమె కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. కూతురి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రీతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read : Minister KTR : నేడు హనుమకొండలో మంత్రి కేటీఆర్ పర్యటన
అయితే.. బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రకటించింది. మంత్రి ఎర్రబెల్లి రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా… కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఎర్రబెల్లి. ప్రీతి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.