సంగారెడ్డి జిల్లాలో రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం ముగ్గురిని బలి తీసుకుంది. గడ్డపోతారంలోని మైలాన్ కంపెనీలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం (మం) గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ముగ్గురు కార్మికుల తీవ్ర గాయాలు పాలుకాగా, ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురు కార్మికులు మృతిచెందారు. దీంతో విషాద ఛాయలు అలముకున్నాయి. పరిశ్రమలో మంటలు ఆర్పారు అగ్నిమాపక సిబ్బంది.
Read Also: Ambati Rambabu: చంద్రబాబు కోసమే జనసేన పార్టీ పుట్టింది
ఈ ఘటనలో మరణించిన ముగ్గురిని గుర్తించారు. మృతులు పారితోష్ (40), రంజిత్ కుమార్ (27), లోకేశ్వర్ రావు(38). బొల్లారం పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరిశ్రమలోని వేర్‌హౌస్ లోపల ద్రావకాన్ని వేరే డ్రమ్ములోకి మారుస్తున్న క్రమంలో స్ట్రాటిక్ ఎనర్జీతో ఫ్లాష్ ఫైర్ రావడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు బొల్లారం సీఐ సురేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన కార్మికులు మరణించారు. మృతులంతా కాంట్రాక్టు కార్మికులు. తీవ్ర గాయాలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రాజేష్ ఫోర్క్ లిఫ్ట్ డ్రైవర్ ప్రమాదం జరిగిన తీరుని వివరించారు. ఈ ఘటనకు రాజేష్ ప్రత్యక్ష సాక్షిగా వున్నారు.
Read also: Ambati Rambabu: చంద్రబాబు కోసమే జనసేన పార్టీ పుట్టింది