Road Accident : తాజాగా పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ నియోజకవర్గం శివాపురం – కొత్తపాలెం రహదారి ప్రాంతంలో ఇన్నోవా కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. కారులోని మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనలోని మృతులు గుంటూరు ప్రాంతానికి చెందిన వారిగా సమాచారం. వీరంతా పుణ్యక్షేత్రాల పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాద ఘటన జరిగినట్లు సమాచారం అందుతుంది. ఘటనపై…
సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోతేకు దగ్గరలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఓ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు.
వేసవికాలం మండుతోంది. సూరీడు ఉదయం నుంచి ప్రచండంగా మారుతున్నాడు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత పెరుగుతూనే వుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి..మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు..ఒకవైపు 45 డిగ్రీలు దాటిన ఎండలు మరో వైపు ఉక్కపోత,వడగాలులతో ఉక్కిబిక్కిరౌతున్నారు..రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ లో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. రెండు మూడు రోజులుగా జైనాథ్ ,బేలామండలాల్లో 45 డిగ్రీలుదాటి నమోదు అవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలతో…
హైదరాబాద్ లో వీకెండ్ వచ్చిందంటే చాలు కుర్రకారు రెచ్చిపోతోంది. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ లారీని ఢీకొట్టారు యువకులు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధి బౌరంపేటలో ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ఢీకొంది కారు. దీంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద అర్ధరాత్రి తర్వాత ఘటన జరిగింది. READ ALSO దూసుకొచ్చిన కారు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ లారీని ఢీకొట్టారా యువకులు. ప్రమాదానికి…
ఛత్తీస్‌ఘఢ్-.బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలో ఈ ఎదురు కాల్పులు జరగగా ముగ్గురు మావోయిస్టుల మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్, ఎకె47 రైఫిల్‌లు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్‌లోని తర్లగూడ తెలంగాణ సరిహద్దు లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి వుంది.