Hero Nani About Awards: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో ‘దసరా’ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ పరిచయ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ కొరియోగ్రఫీ కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. దసరా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ‘నేచురల్ స్టార్’ నాని అవార్డు అందుకున్నారు. అవార్డు తీసుకున్న అనంతరం నాని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పుడు అవార్డులు తీసుకోవాలనే ఆసక్తి లేదని చెప్పారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుక అట్టహాసంగా జరిగింది.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుకలో నాని మాట్లాడుతూ… ‘ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో స్టేజ్ మీద అవార్డులు అందుకుంటున్న వారిని చూసి ఏదో ఒకరోజు నేను కూడా ఆ స్థాయికి వెళ్లాలని అనుకునేవాడిని. అయితే ఆ కోరిక క్రమంగా తగ్గుతూ వచ్చింది. అవార్డులపై ఇప్పుడు పెద్దగా ఆసక్తి లేదు. నా సినిమా దర్శక నిర్మాతలు, టెక్నిషియన్స్, నటీనటులతో పాటు నా నిర్మాణ సంస్థలో పరిచయమైన నూతన నటీనటులు అవార్డులు తీసుకుంటే అందరితో కూర్చొని చూడాలన్నదే ఇప్పుడు నా కోరిక’ అని అన్నారు.
Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
‘ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది అవార్డు గురించి కాదు. శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్‌లు అవార్డులు తీసుకుంటుంటే చూడాలని వచ్చాను. ఉత్తమ పరిచయ దర్శకుల విభాగంలో ఇద్దరు అవార్డు సొంతం చేసుకోవడం, వాటిని నేను అందజేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ జ్ఞాపకం. కొత్త టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ప్రయాణంలో నేనూ భాగం కావడం నాకెంతో ఆనందాన్నిస్తుంది. 2023 నాకెంతో ప్రత్యేకమైనది. థ్యాంక్యూ సో మచ్’ అని నాని పేర్కొన్నారు.