Today Gold Price in Hyderabad: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గిన విషయం తెలిసిందే. తులం బంగారంపై ఏకంగా రూ.5 వేల వరకు తగ్గింది. వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా తగ్గడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా మళ్లీ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. వరుసగా మూడు రోజులు గోల్డ్ రేట్స్ పెరిగాయి. నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (ఆగష్టు 4) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.64,700లుగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.70,580గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్స్ పుత్తడి ధర రూ.64,700లుగా.. 24 క్యారెట్స్ ధర రూ.70,580గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.64,850లుగా.. 24 క్యారెట్స్ ధర రూ.70,730గా కొనసాగుతోంది. ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.64,700లుగా.. 24 క్యారెట్స్ ధర రూ.70,580గా నమోదైంది.
Also Read: Manu Bhaker: పీవీ సింధు ఓటమి.. మను భాకర్‌కు గోల్డెన్ ఛాన్స్!
ఇటీవల వరుసగా పెరిగిన వెండి ధర కూడా కాస్త దిగొచ్చింది. నిన్న భారీగా తగ్గిన వెండి.. నేడు స్థిరంగా ఉంది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.85,500గా ఉంది. ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.85,500గా ఉంది. బెంగళూరులో రూ.85,750, చెన్నైలో 90,900గా నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.90,900గా కొనసాగుతోంది.