IT Raids on DSR Group: DSR గ్రూప్ కంపెనీల్లో ఐటీ సోదాలు.. టాక్స్ చెల్లింపులలో భారీగా అవకతవకలు!
- ప్రముఖ DSR గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు సోదాలు
- కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు
- జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, SR నగర్, సురారం ప్రాంతాలలో సోదాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids on DSR Group: హైదరాబాద్‌లో ప్రముఖ DSR గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు సోదాలు చేపట్టారు. నేడు ఉదయం నుండి ప్రారంభమైన ఈ సోదాలు కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ కొనసాగుతున్నాయి. అందిన వివరాల ప్రకారం DSR ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ఇతర అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకేసారి దాదాపు 10 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి.
Honey Trap: ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో అమ్మాయితో పరిచయం.. అసభ్యకరంగా ఫోటోలను మార్ఫింగ్ చేసి?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇందుకు సంబంధించి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, SR నగర్, సురారం ప్రాంతాలలో ఐటీ డిపార్మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలు.. కంపెనీ పన్నుల చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఐటీ శాఖకు అనుమానం రావడంతో జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనితో కంపెనీకి సంబంధించిన గత ఐదు సంవత్సరాల పన్ను చెల్లింపులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సోదాలు సజావుగా కొనసాగేందుకు CRPF బలగాలను కూడా మోహరింప చేశారు అధికారులు.
ChatGPT Go: చాట్జీపీటీ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్!
ఈ క్రమంలో, DSR గ్రూప్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణరెడ్డి నివాసాలు, కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఐటీ శాఖ సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా మరిన్ని వివరాలు వెలువడే అవకాశముంది.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!