Prasanna Kumar: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో తీవ్ర పోటీ నెలకొంది. బడా నిర్మాతలు వర్సెస్ చోటా నిర్మాతలు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. చిన్న నిర్మాతలకు కూడా థియేటర్లు ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఒక్కరి చేతుల్లో ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వక్రీకరిస్తున్నారని అన్నారు. బెన్ ఫిట్ షోలు చిన్న సినిమాలకు కూడా ఇవ్వాలని అన్నారు.
READ ALSO: Kerala: కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర.. తొలిసారి తిరువనంతపురంలో..!
అలాగే ఆయన మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కరిస్తే ఎన్నికల నుంచి విత్ డ్రా చేసుకుంటామని చెప్పారు. పెద్ద నిర్మాతలు లేబర్ కమిషనర్ వద్దకు వెళ్లడం దారుణమని, చిన్న నిర్మాతలం సొంత డబ్బుతో నామినేషన్ వేశాం అని అన్నారు. గతంలో ఒకసారి అవకాశం ఇచ్చినా వాళ్లు ఏం చేయలేదని, మెడిక్లెయిమ్ చేయిస్తామని అది కూడా చేయలేదని చెప్పారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో నెలకొన్న తీవ్రమైన పోటీ ఎటువైపు మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తిగా మారింది.
READ ALSO: JC Prabhakar Reddy: ఒక రైతుగా జిల్లా కలెక్టర్‌ను కలిశా.. దీన్ని రాజకీయం చేయొద్దండి