Miss Universe 2025: విశ్వసుందరి 2025 (Miss Universe 2025) కిరీటం మెక్సికో వశమైంది. థాయ్‌లాండ్ వేదికగా అట్టహాసంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ (Fatima Bosch) విజేతగా నిలిచారు. డెన్మార్క్‌కు చెందిన గత ఏడాది విశ్వసుందరి విక్టోరియా ఆమెకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేశారు. ఇక పోటీల ఆరంభం నుంచే ఫాతిమా బాష్ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. తనదైన ఆత్మవిశ్వాసం, గాంభీర్యం, అద్భుతమైన ప్రదర్శనతో న్యాయ నిర్ణేతలను మెప్పించి ఆమె ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
ఎవరీ ఫాతిమా బాష్?
మెక్సికోలో పుట్టి పెరిగిన ఫాతిమాకు 25 ఏళ్లు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన పోటీల్లో ‘మిస్ యూనివర్స్ మెక్సికో 2025’గా ఎంపికయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఇప్పుడు విశ్వ వేదికపై మెక్సికో జెండాను ఎగురవేశారు. ఇక పోటీల సమయంలో వైరల్ అయిన ‘వాకౌట్’ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రిహార్సల్స్ జరుగుతుండగా.. అక్కడి థాయ్ పేజెంట్ డైరెక్టర్ ఒకరు మందలించడంతో ఫాతిమా మనస్తాపానికి గురయ్యారు. ఆ వెంటనే ఆమె తన ఈవనింగ్ గౌన్, హై హీల్స్‌తోనే అక్కడి నుంచి కోపంగా వాకౌట్ (Walkout) చేశారట. ఈ వార్త ఆ సమయంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ తర్వాత వెంటనే తేరుకున్న ఫాతిమా.. ఎంతో పరిణితితో తిరిగి పోటీలో పాల్గొని, తన పట్టుదలతో ఏకంగా కిరీటాన్నే గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
Si hay algo que no se podía negar, era la belleza de Fátima Bosch, quizás no tuvo los mejores desfiles, pero tiene una voz que supo utilizar desde el inicio del concurso, su mensaje llegó y la convirtió en la ganadora😮💨 #MissUniverse pic.twitter.com/wKDjPpKKsX
— nacho con O (@NachoConO) November 21, 2025