Bengaluru ATM Cash Van Robbery: బెంగళూరులో ఏటీఎం క్యాష్ వాహనం నుంచి పట్టపగలే రూ.7.11 కోట్లు దోపిడీ చేయడం తీవ్ర కలకలం రేపింది.. అయితే, బెంగళూరు దోపిడీ కేసుతో ఆంధ్రప్రదేశ్‌కు లింక్‌లు ఉన్నాయంటున్నారు పోలీసులు.. దొంగలు చిత్తూరు జిల్లాలో వాహనాన్ని వదిలేసి పారిపోయారు.. ఇన్నోవా వాహనం (నెంబర్: UP 14 BX 2500) లో నగదును తరలించిన దుండగులు, ఆ వాహనాన్ని చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురం చర్చివద్ద వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ వాహనాన్ని వదిలేసిన తర్వాత నగదును మరో వాహనంలో మార్చుకుని పరారైనట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Read Also: Akhanda2 : అఖండ 2.. థియేట్రికల్ రైట్స్.. బాలయ్య కెరీర్ బెస్ట్
ఇక, సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం, ఆ వాహనం గుడిపాల మండల కేంద్రం మీదుగా చిత్తపార గ్రామానికి వెళ్లి, కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. దొంగలు రిజర్వ్ బ్యాంకు లేదా ఆదాయ పన్ను శాఖ అధికారులమని నమ్మించి, ఏటీఎంలకు నగదు తీసుకెళుతున్న వాహనాన్ని ఆపి తనిఖీ పేరుతో సిబ్బందిని కిందకు దింపి, కేంద్ర ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న వాహనంలో నగదును మార్చి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనంలో సమీప గ్రామాల వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని అనుమానంతో, కర్ణాటక పోలీసులు అర్ధరాత్రి చిత్తూరు పోలీసులతో కలిసి చిత్తపార గ్రామంలో తనిఖీలు చేపట్టారు. ఈ భారీ నగదు మరో వాహనంలో ఎక్కడికి తరలించబడిందన్న దానిపై కర్ణాటక పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.