Akshara Gowda : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మాస్ కా దాస్ హీరోయిన్
- తల్లిని అయినట్లు ప్రకటించిన అక్షర గౌడ
- బిడ్డ ఫోటోను షేర్ చేసిన ముద్దుగుమ్మ
- పెళ్లయినా సినిమాల్లో నటిస్తున్న బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshara Gowda : తెలుగు ప్రేక్షకులకు దాస్ కా దమ్కీ, మన్మథుడు 2, హరోం హర, ది వారియర్ సినిమాలతో పరిచయం అయిన హాట్ బ్యూటీ అక్షర గౌడ. ఈ కన్నడ బ్యూటీ తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ మంచి గుర్తింపే తెచ్చుకుంది. కమర్షియల్‌గా ఒకటి రెండు హిట్స్ పడి ఉంటే కచ్చితంగా ఈ అమ్మడి క్రేజ్, కెరీర్ మరోవిధంగా ఉండేది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా తాను తల్లిని అయినట్లు ప్రకటించింది. అంతే కాకుండా తన బిడ్డ ఫోటోను షేర్ చేసింది. తద్వారా తన సంతోషాన్ని తన ఫాలోవర్స్‌తో పంచుకుని తన ప్రెగ్నెంట్ సమయం ఎలా గడిచిందనే విషయాలను తన అభిమానులతో చెప్పుకొచ్చింది. 2011లో సినిమా ఇండస్ట్రీలో అక్షర గౌడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. చాలా తక్కువ సమయంలోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. సొంత భాష కన్నడలో మాత్రం ఈ అమ్మడికి 2018 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. తమిళ్, హిందీ సినిమాల్లో మంచి గుర్తింపు రావడంతో అక్కడే సినిమాలు చేస్తూ వచ్చింది. కన్నడంలో ఈమె చేసిన సినిమాలు లెక్కకు కొన్ని మాత్రమే అయినా అక్కడ కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న టైంలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆమె ప్రారంభించింది.
Read Also:Pushpa 2 : పుష్ప 2 సక్సెస్ సంబరాల్లో అల్లు అర్జున్.. ఈ సారి గ్యాప్ తప్పని సరి అయ్యేలా ఉందే
Also Read
పెళ్లి తర్వాత కూడా ఆ సినిమాల్లో నటించింది. విశేషం ఏంటంటే ఈ ఏడాది కూడా అక్షర నటించిన సినిమా విడుదలైంది. అంటే ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో అక్షర గౌడ ఆ సినిమాలో నటించి ఉంటుంది. పెళ్లి, పిల్లల తర్వాత సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారింది. కనుక అక్షర గౌడ సైతం మళ్లీ సినిమాలతో బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆమె కన్నడంలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేసే ఛాన్సులు ఉన్నాయి. ఇంతకు ముందు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు తన బేబీతో ఉన్న ఫోటోను షేర్ చేయడం ద్వారా ముఖ్యాంశాల్లో ఉంది. అక్షరకు ఆమె ఫ్యాన్స్ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు.
Read Also:Puhspa 2 : ఓవర్సీస్ లో రికార్డుల రప్ప రప్పా చేస్తున్న పుష్ప రాజ్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!