Fans Predicts on World Cup 2023 Final: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ మ్యాచ్‌లు చివరి అంకానికి చేరుకున్నాయి. లీగ్ మ్యాచ్‌లు ఇంకా నాలుగు మిగిలున్నా.. సెమీస్ ఆడే జట్లు ఏవో దాదాపు ఖరారు అయ్యాయి. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు అధికారిక సెమీస్ బెర్తులు ఖరారు చేసుకోగా.. నాలుగో టీమ్‌గా దాదాపుగా న్యూజిలాండ్ సెమీస్‌కు అర్హత సాధించింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన కివీస్.. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లను వెనక్కి నెట్టి సెమీస్‌కు మార్గం సుగమం చేసుకుంది.
ప్రపంచకప్ 2023లో సెమీఫైనల్ చేరే జట్లపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఏయే జట్లు ఎవరితో సెమీస్ ఆడతాయనే విషయంపై కూడా స్పష్టత వచ్చేసింది. నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే ప్రపంచకప్ 2023 తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక 16న కోల్‌కతా వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టీమ్స్ ఢీ కొట్టనున్నాయి. సెమీస్ నేపథ్యంలో ఫైనల్ ఏ జట్లు చేరతాయని ఫాన్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫామ్, బలాబలాల ప్రకారం.. భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ చేరడం ఖాయమని ఫాన్స్ జోస్యం చెబుతున్నారు.
Also Read: Nandamuri Balakrishna: హిందీ భాషపైన నాకున్న సత్తా ఏంటో చూపించా.. బాలయ్య బాబు వీడియో వైరల్!
ప్రపంచకప్ 2023లో భారత్, ఆస్ట్రేలియా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయని ఫాన్స్ అంటున్నారు. భారత్ ఏమాత్రం తడబాటు లేకుండానే సెమీ ఫైనల్ చేరుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అదరగొడుతోంది. నామమాత్రపు చివరి లీగ్ మ్యాచులో నెదర్లాండ్స్‌ను టీమిండియా ఢీకొంటుంది. అందులో కూడా విజయం సాధించడం ఖాయమే. మరోవైపు ఆసీస్ ఆరంభంలో రెండు మ్యాచులలో తడబడినా.. ఆ తర్వాత పుంజుకుంది. ఆఫ్ఘన్‌పై అయితే అద్భుతంగా ఆడింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఇదే ఫామ్ సెమీస్ మ్యాచులో చూపాలని ఆసీస్ చూస్తోంది. దక్షిణాఫ్రికా, న్యూజిల్యాండ్ కూడా ఫామ్ మీదున్నా.. ఈ రెండు టీమ్స్ లీగ్ దశలో తలపడ్డాయి. కాబట్టి 2003లో మాదిరి ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడవుతాయని, రోహిత్ సేన విజేతగా నిలుస్తుందని ఫాన్స్ అంటున్నారు.