టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలకు క్రేజ్ ఉంటున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. గీత గోవిందంతో సూపర్ హిట్ కొట్టిన పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.. ఇప్పుడు ఈ చిత్రం నుంచి సాంగ్ రాబోతుంది..
ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ఫస్ట్ సింగిల్ ‘నందనందనా..’ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. నిన్న రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది.. ఈరోజు ఈ సినిమా సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు.. ఆ సాంగ్ కోసం రౌడీ హీరో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..
ఇక ఈ సినిమాను ఫుల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా రిలీజైన ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటోంది. గీత గోవిందంలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ పాటకు పనిచేసిన లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సింగర్ సిధ్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాంబోలో ఈ సాంగ్ రాబోతుంది.. త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని, అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..