నిత్యం కొన్ని లక్షల మద్యం అమ్మకాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. అయితే.. మద్యం ధరలు పెరగినా మందుబాబు తగ్గేదెలే అన్నట్లుగా ప్రభుత్వానికి మద్యం రూపంలో ఖజానాను నింపుతున్నారు. అయితే.. ఇంత డబ్బులు ఖర్చుచేసిన కొనేది నకీల మద్యమా.. లేక ఒరిజినలా.. తెలియడం లేదు. రాష్ట్రం రాజధానిలో నకిలీ మద్యం ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నకిలీ మద్యంలో.. మత్తుకోసం ఓ రకమైన రసాయనాన్ని కలిపి ఒరిజినల్ మద్యంలా సరఫరా చేస్తున్నారు. అయితే.. ఎక్కువగా రోజువారి కూలీలు ఈ మద్యం బారినపడుతున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా హయత్‌నగర్, చౌటుప్పల్‌లోని వివిధ ప్రాంతాల్లో కోటి రూపాయల విలువైన కల్తీ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు.
Also Read : ఇలాంటి సమయంలో సెక్స్ చేయకూడదు.. లేకపోతే ప్రాణాలు పోతాయ్..!
ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్‌లోని బెల్టుషాపులకు తక్కువ ధరకు రెండు బ్రాండ్‌ల మద్యాన్ని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం నమూనాలను విశ్లేషణ కోసం ఎక్సైజ్ ల్యాబ్‌కు పంపగా, ఈ విషయంపై విచారణ జరుగుతోంది. పక్కా సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు హయత్‌నగర్, చౌటుప్పల్‌లోని శ్రీనగర్ కాలనీ, పెద్దంబర్‌పేట్ ప్రాంతాల్లో అక్రమ నిల్వలపై దాడులు చేశారు. చౌటుప్పల్‌కు చెందిన ఓ మద్యం వ్యాపారి ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఎక్సైజ్ సుంకం ఎగవేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన కల్తీ మద్యం అవునా..కాదా అని నిర్ధారించేందుకు ఎక్సైజ్ అధికారులు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు.