Lamprey: ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇటు భూమి మీద.. అటు నీటిలో చాలా మర్మమైన జీవులు ఉన్నాయి. వాటి గురించి శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సరైన సమాచారాన్ని పొందలేకపోయారు. ఈ జీవుల గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి చేప ఒకటి ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈ చేపలు డైనోసార్లను కూడా వేటాడినట్లు చెబుతున్నారు. లైవ్ సైన్స్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, ఈ చేప పేరు లాంప్రేస్. ఇది ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలోని మంచినీటి ప్రాంతాలలో కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఈ చేప ఘన పదార్థాలను తినదు. కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే స్వీకరించి జీవిస్తుంది. అంటే రక్తాన్ని పీల్చి కడుపు నింపుకుంది. దాని వేట భయంకరంగా ఉంటుంది. ఇది దాదాపు 45 కోట్ల ఏళ్లుగా భూమిపై ఉందని చెబుతున్నారు.
Read Also:Atrocious: ఇంత దారుణమా.. ఏడేండ్ల చిన్నారిపై అత్యాచారం చేసి గొంతుకోసి హత్య
ఈ చేపకు దవడలు లేవు, అయినప్పటికీ అది తన ఎరను క్రూరంగా చంపుతుంది. దవడలకు బదులుగా పళ్ళతో కప్పబడిన పీల్చే నోరును కలిగి ఉంటుంది. వారు ఎరను పట్టుకోవడానికి, రక్తాన్ని తీయడానికి ఆ పళ్లను ఉపయోగిస్తుంది. ఈ చేపకు శరీరంలో ఒక్క ఎముక కూడా లేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ చేపల గురించి ప్రస్తుతం 40 రకాల పసిఫిక్ లాంప్రేలు ఉనికిలో ఉన్నాయని చెప్పబడింది. అవి నాలుగు సార్లు అంతరించిపోయే దశకు చేరుకున్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఆడ లాంప్రే ఒకేసారి 2 లక్షల గుడ్లు పెడుతుంది కాబట్టి అవి మళ్లీ ఉనికిలోకి వచ్చాయి.
Read Also:Karnataka Bandh: కర్ణాటకలో ఆందోళనలు, అరెస్టులు.. డిపోలకే పరిమితమైన బస్సులు! 44 విమానాలు రద్దు
Don’t mind the teeth, we’re just migrating.
Using its jawless mouth as a big suction cup, Pacific lamprey can migrate from oceans to freshwater breeding grounds, like this group seen at Bonneville Dam on the Columbia River earlier this summer. @USFWS video: Brent Lawrence pic.twitter.com/UwjX5WO9Tv
— USFWS Pacific (@USFWSPacific) September 19, 2022