పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని నివాస ప్రాంతంలోని అక్రమ బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీనిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను కష్టపడి సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
Also Read : MLC Kavitha ED Live: ప్రముఖ అడ్వకేట్ తో కవిత సంప్రదింపులు
అయితే 24 పరగణాల జిల్లా మహేస్తలాలోని ఓ ఇంట్లో ఓ కుటుంబం అక్రమంగా బాణసంచా తయారీ యూనిటీ ను నిర్వహిస్తోంది. అయితే సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో ఇంటి యజమాని, అతడి భార్య, కుమారుడు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Also Read : Heart-Attack : డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి
ఈ ప్రాంతం రద్దీగా ఉండటం, బలమైన గాలులు వీయడంతో త్వరగా మంటలు వ్యాపించాయి. రెస్య్కూటీం ఎంతో కష్టపడి మంటలను చల్లార్చారు. అయితే లోపలికి వెళ్లి చూడటంతో మూడు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ అధికారుల బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించి నమూనాలను సేకరించింది. ఈ మంటలకు గల కారణానప్ని తెలుకునేందుకు దర్యాప్తు చేస్తుంది. అయితే ఈ నివాస ప్రాంతంలో యూనిట్ ఎలా నడుస్తోందో పరిశీలించడానిక దర్యాప్తునకు ఆదేశిస్తామని బెంగాల్ మంత్రి సుజిత్ బోస్ హామీ ఇచ్చారు.