Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు సగ భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ లో కూడా ఈ మధ్య పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా వారికి మొన్ననే గుడ్ న్యూస్ తెలిపారు మేకర్స్. నూతన సంవత్సరం కానుకగా హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.
Read Also:IPL 2025: ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ ఆ టీమ్స్ మధ్యనే.. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ ఎప్పుడంటే?
పవర్ స్టార్ ఆలపించిన మాట వినాలి అనే సాంగ్ ను విడుదల చేయగా ఆ సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాని ఈ ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్.
Read Also:Kadapa Crime: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్య దారుణ హత్య
అయితే ఇక రెండో సాంగ్ కోసం అంతా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ సాంగ్ పై నేడే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ రెండో సాంగ్ పై మేకర్స్ నేడు క్లారిటీ ఇవ్వనున్నారట. అలాగే దీనిపై నిధి అగర్వాల్ కూడా టీజ్ చేయడంతో ఇదో డ్యూయెట్ సాంగ్ కూడా కావచ్చని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే మెగాసూర్య ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.