మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పరమ పవిత్రమైన కీసరగుట్ట శ్రీభవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న లింగాలకుంటలో కొందరు గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం త్రవ్వకాలు చేపట్టిన ఆనవాళ్లు కనిపించాయి. స్వామివారి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న లింగానికి పూజలు చేసి గుప్త నిధుల కోసం కొన్ని అడుగుల మేరకు త్రవ్వకాలు జరిపారు. గుప్తనిధుల కోసం త్రవ్వకాలు జరిపారనే ఆనవాళ్లుగా అక్కడే ఓ మట్టికుండ, ఎర్రని గుడ్డ, పసుపు, నీళ్ళ బాటిల్ కనిపించడం పలు…
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో మరో మృతదేహాన్ని గుర్తించారు. లోకో ట్రైన్ శిథిలాల కింద డెడ్ బాడీ గుర్తించిన రెస్క్యూ టీమ్స్ తవ్వకాలు చేపడుతోంది. బృందాలు శిథిలాలను గ్యాస్ కట్టర్ లతో కట్ చేస్తున్నాయి. ఒక కాలు కనిపించడం, దుర్వాసన రావడంతో తవ్వకాలు చేపడుతున్నారు. మధ్యాహ్నానికి మృతదేహాన్ని బయటకు తీసుకురానున్నారు.
శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు (SLBC)లో జరిగిన విషాద ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజుకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులో టన్నెల్ నిర్మాణ సమయంలో 8 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టన్నెల్‌లో గౌరావ్ పెనిట్రేటింగ్ రాడార్ (GPR), క్యాడవర్ డాగ్స్ సాయంతో తవ్వకాలు కొనసాగుతున్నాయి.
SLBC Tragedy: శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు (SLBC) లో జరిగిన విషాద ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ 17వ రోజుకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులో టన్నెల్ నిర్మాణ సమయంలో జరిగిన విషాద ఘటనతో 8 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టన్నెల్‌లో గౌరావ్ పెనిట్రేటింగ్ రాడార్ (GPR), క్యాడవర్ డాగ్స్ సాయంతో తవ్వకాలు కొనసాగుతున్నాయి. రాడార్, శునకాలు గుర్తించిన ప్రదేశాలను డీ1, డీ2, డీ3 ప్రాంతాలుగా విభజించి అక్కడ తవ్వకాలు చేపట్టారు అధికారులు.…
డెల్టాకు సాగునీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఖరీఫ్ సాగు ప్రారంభం అవుతున్న వేళ రైతులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. డెల్టా ప్రాంతంలోని లక్షలాది ఎకరాల పరిధిలో పంటలు వేయాల్సి ఉండగా పంటలకు సాగునీరు అందించే పంట కాలువలు మాత్రం పూడికతో నిండి పోయి ఉన్నాయి. ఇరిగేషన్ రెవెన్యూ శాఖల సమన్వయంతో పంటలకు నీరు అందించాల్సిన అధికారులు కనీసం పంట కాలువల దుస్థితిపై దృష్టి పెట్టకపోవడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు సాగునీరు విడుదల…