మొన్న తెలుగు పేపరు … నిన్న హిందీ … ఇవాళ ఇంగ్లీష్ పేపర్ లీక్ అంటూ జరుగుతున్న ప్రచారం సత్యసాయి జిల్లాకు ప్రాకింది.తాజాగా ఆమడగూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపింది. అప్రమత్తం అయిన జిల్లా అధికారుల ఘటన పై విచారణకు ఆదేశించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆమడగూరులో 10గంటల సమయంలో పదవ తరగతి ఇంగ్లీష్ పేపర్ స్థానిక వాట్సప్ గ్రూపులో చక్కర్లు కొట్టింది.స్థానికంగా పేపర్ లీక్ అయిందన్న ప్రచారంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తం అయ్యారు. మొదట పేపరు లీక్ వ్యవహారాన్ని కొట్టివేశారు అధికారులు. తరువాత విద్యాశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు బృందంగా ఏర్పడి పాఠశాలలో విచారణ చేపట్టారు. ఆమడగూరు ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రశ్నపత్రం లీక్ చేసి ఉంటారని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
సాంకేతిక పరంగా ఎవరి సెల్ నుంచి పేపర్ వెళ్లిందని కనుక్కునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.మరో వైపు పేపరు లీక్ వదంతులు నమ్మవద్దని పోలీసులు,విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పూర్తి విచారణ తరువాత లీక్ కు కారణమ్తెన వారిపై చర్యలు తీసుంటామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా వుంటే పదో తరగతి ఇంగ్లీష్ ప్రశ్న పత్రం లీకేజీ ఘటన లో పురోగతి కనిపించింది. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు వున్నట్టు తెలుస్తోంది. గాండ్లపెంట పరీక్షల ఛీప్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్, అటెండర్ నరేష్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు లు పేపర్ లీక్ లో పాత్రధారులు గా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై గాండ్ల పెంట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు డీఈవో నాగేశ్వరరావు.
Summer Heat: దంచికొడుతున్న ఎండలు.. జనం బెంబేలు