Janasena: పవన్‌కళ్యాణ్, కొణతాల రామకృష్ణ భేటీ.. త్వరలో జనసేనలోకి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ బుధవారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే కొణతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నట్లు తెలిసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం బరిలోకి దిగాలని కొణతాల రామకృష్ణ భావిస్తున్నారు. తన ఎంపీ టికెట్ ఇవ్వాలని కొణతాల ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు అనుగుణంగా కొణతాల రామకృష్ణ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. మంచిరోజు చూసుకొని ఈ నెలలోనే జనసేనలో కొణతాల రామకృష్ణ చేరనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయ పరిస్థితులపై పవన్ -కొణతాల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
Read Also: CM YS Jagan: అంబేడ్కర్ మహా శిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం
Also Read
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
- Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కాంగ్రెస్ నేతగా, మంత్రిగా శాసించిన నేత. గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల.. నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో వున్నారు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఓటమి పాలైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడంతో కొణతాల హవా నడిచింది. అనంతరం రాష్ట్ర విభజనతో కొణతాల రామకృష్ణ కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ ఓటమి పాలవ్వడం, విశాఖ ఎంపీగా విజయమ్మ ఓడిపోవడంతో కొణతాలకు పార్టీ హైకమాండ్‌తో గ్యాప్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. అనంతరం ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అనంతరం ఆయన టీడీపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. ఆయన రాజకీయాలుకు దూరంగా ఉన్నప్పటికీ రైతు సమస్యలు, చెరకు సాగులు ఇబ్బందులు, షుగర్ ఫ్యాక్టరీలు మూతపడటం వంటి వాటిపై కొణతాల రామకృష్ణ పోరాటం చేస్తూ వచ్చారు. ఆయన ఇటీవల యాక్టివ్ పాలిటిక్స్ వైపు కొణతాల దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. పవన్‌తో భేటీ కావడంతో ఆయన జనసేనలో చేరతారని ఖరారైంది.
తాజావార్తలు
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!