Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana: టాలీవుడ్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు పాన్-ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ భాగ్యనగరంపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకుంది. కెరీర్లో ఎక్కడికి వెళ్లినా, ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా తన మనసంతా ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటుందని మనసులోని మాటను బయటపెట్టింది. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ విజువల్ వండర్ ‘రామాయణ’. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా పాల్గొంది.
ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లో యాంకర్ రకుల్‌ను ఆప్యాయంగా పలకరిస్తూ.. “వెల్కమ్ రకుల్.. నువ్వు హైదరాబాద్ అమ్మాయివే కదా!” అని అనగానే, రకుల్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే రియాక్ట్ అయింది. “నిజమే.. నా హృదయం ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటుంది (మై హార్ట్ ఈజ్ హైదరాబాద్)” అంటూ నవ్వుతూ బదులిచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారానే తనకు స్టార్డమ్ వచ్చిందని, ఇక్కడి ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాలే తనను ఈ స్థాయికి చేర్చాయని అన్నారు. ఇదే విషయాన్ని గతంలోనూ పలు సందర్భాల్లో రకుల్ గుర్తుచేసుకుంది. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ ప్రమోషన్లలో పాల్గొంటూ, హైదరాబాద్ వేదికగా ఆమె చేసిన ఈ కామెంట్స్ తెలుగు ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో మరిన్ని చిత్రాలు చేయాలని ఉందని చెప్పారు. ప్రస్తుతం రకుల్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
-
Anirudh : హీరోలను మించిపోతున్న అనిరుద్ రెమ్యునరేషన్
-
RC 17 : రామ్ చరణ్ ‘RC 17’ కోసం రంగంలోకి అనిరుధ్
-
Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!