జగన్ రైతులకు భరోసా ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు టీడీపీ నేతలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు గోపాలపురం గ్రామంలో మొన్న వచ్చిన తుపాన్ దాటికి నష్టపోయిన మొక్కజొన్న తోటలను పరిశీలించారు టిడిపి నాయకులు మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, తిరువూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ శావల దేవదత్. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అనే చెప్పుకొనే జగన్ కి రైతులు బాధలు తెలియవా ? జగన్ రెడ్డి మీ రైతు భరోసా కేంద్రాలు అన్ని భోగస్ మీరు ఏ రైతును ఆదుకున్నారు.
2019 లో జగన్ రెడ్డి నువ్వు తిరువూరు వచ్చినప్పుడు రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు,వినగడప బ్రిడ్జీ కట్టావా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.
Read Also:Alla Ramakrishna Reddy Live: జగన్ తోనే ఉంటా.. ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు
తాడేపల్లి పరదాల చాటున ఉండే ముఖ్యమంత్రి జగన్ కాస్తా బయటకు వచ్చి రైతులు పడే బాధలు చూడు. ముద్దులు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు వారికి వాతలు పెడుతున్నాడు. నువ్వు కట్టించిన రైతు భరోసా కేంద్రాలు పెద్ద బోగస్ వాటి ద్వారా ఎవరికి న్యాయం చేసావు చెప్పాలన్నారు. అకాల వర్షాలు, తుఫాన్ల దాటికి నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలన్నారు.
Read Also: RRR: జపాన్ లో ఈ రికార్డ్ బ్రేక్ చెయ్యాలంటే మరో పాతికేళ్లు పడుతుంది