రాజధాని అమరావతికి రైల్వేలైన్ వెళ్లే పలు గ్రామాల రైతులు, స్థానిక ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు మంత్రి నారాయణ.. రైతుల డిమాండ్లు, విజ్ఞప్తులను విన్న ఆయన.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.. ఈ సమావేశానికి పెదకూరపాడు, తాడికొండ ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రావణ్ కుమార్, కర్లపూడి, పెదపరిమి, తాడికొండ, నిడుముక్కల గ్రామాల రైతులు హాజరయ్యారు..