వైసీపీ నేతలపై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీమంత్రి భూమా అఖిలప్రియ. ఆళ్ళగడ్డ రాజకీయం అవినీతిలో ముందంజలో ఉందన్నారు. ఆళ్లగడ్డలో అధికార పార్టీ నాయకులు లో స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నారని ఎన్ని సార్లు చెప్పినా పోలీసులు అసలు వ్యక్తులను తప్పిస్తున్నారన్నారు అఖిల ప్రియ. MLA సపోర్ట్ తోనే స్థానిక నాయకులు అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నారు. అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తుండగా పట్టించిన భూమా విఖ్యాత్ రెడ్డి పై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు.
మహిళని కించపరిచారని భూమా విఖ్యాత్ రెడ్డి పై పోలీసులు యస్.సి., యస్.టీ తప్పుడు కేసు నమోదు చెయ్యడం దారుణం అన్నారు అఖిలప్రియ. రేషన్ బియ్యం పట్టించాడనే కోపంతోనే విఖ్యాత్ రెడ్డి పై పోలీసుల సహాయంతో స్థానిక MLA తప్పుడు కేసు పెట్టించారు. స్థానిక నాయకులు బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాంగం కల్పించిన యస్.సీ. యస్టీ అట్రాసిటీ కేసులను తప్పు దారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ అక్రమ కేసుల పైన మెజిస్ట్రేట్ కు లేఖ రాస్తాం..దీనిపై హై కోర్ట్ లో రిట్ పిటీషన్ వేస్తాం అన్నారు భూమా అఖిలప్రియ. ఇకనుంచి ఎక్కడ అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని సమాచారం అందిన వెంటనే మేమే స్పాట్ కి వెళ్తాం అన్నారు అఖిలప్రియ.
Read Also: Road Accident: రోడ్డు దాటుతున్న మహిళలను ఢీకొట్టిన కారు.. ఐదుగురి మృతి