మెదక్ జిల్లా నర్సాపూర్‌లో డబుల్ బెడ్రూంలను బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పరిశీలించారు. అయితే.. డబుల్ బెడ్ రూమ్ ల కోసం మెదక్ లో బీజేపీ ధర్నా చేపట్టగా.. ఈ ధర్నాలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు డబల్ బెడ్ రూమ్ లు ఎన్ని పంపిణీ చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం 9 వేలకోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని, ఎన్నికలు అయ్యేంతవరకు ఎక్కడ కూడా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయరంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
Also Read : ఈ పువ్వు రసం వాడితే.. కళ్లజోడు అవసరం ఉండదు..!
సొంత ఇంటి కల కేసీఆర్ హయాంలో నెరవేరదని, కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి, పనులు తంగేళ్లు దాటవంటూ హెద్దేవా చేశారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ లు ఎవరికి ఇవ్వడం లేదని, పంట నష్టపోయిన రైతులకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ భీమా యోజన అమలు చేయడం లేదని, నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టుకు రైతులు పోతే డబ్బులు ఇవ్వమని సుప్రీంకోర్టు కు పోయారన్నారు ఈటల రాజేందర్. నోటిఫికేషన్ లు ఇస్తే పేపర్ లీకేజీ చేస్తారని, ఇప్పటివరకు 17 పేపర్లు లీకేజీ అయ్యాయన్నారు ఈటల రాజేందర్. చదువుకున్నోళ్లకు ఉద్యోగం రావడం లేదు.. పైరవీలకే ఉద్యోగాలు వస్తున్నాయని, టీఎస్సీఎస్సీలో అన్ని అక్రమాలే అని ఆయన ధ్వజమెత్తారు. యువకులు నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్న నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ మాయల మరాఠీ… 10 ఏండ్లు గోస పడ్డామని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాలన్నారు.
Also Read : Nama Nageswara Rao: దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరనికి ఎంత ఇచ్చారో చెప్పాలి