ప్రస్తుతం జనరేషన్ లో పిల్లల నుంచి పెద్దవారి వరకు స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వలన కంటికి సంబందించిన సమస్యలు వస్తున్నాయి.
సమస్య రాగానే కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ జనరేషన్లో చాలామంది మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి.
చిన్న పిల్లలు ఎక్కువగా ఫోన్స్ వాడటం వలన కూడా చాలా చిన్న వయసులోనే కళ్ల జోడు వచ్చేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలు అనేవి వచ్చేస్తున్నాయి.
కంటిచూపును మెరుగుపరుచుకోవడానికి మన ఇంటి పెరట్లో ఉన్న ఒక మొక్క సహాయపడుతుంది ఆ మొక్క పేరే నందివర్ధనం.
నందివర్ధనం పువ్వులు తెల్లని రంగులో ఉండి నిగనిగలాడుతూ కనిపిస్తాయి. ఈ పువ్వులను పూజకు వాడుతూ ఉంటాం. ఈ పూలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి మనలో చాలా మందికి తెలియదు.
కంటి సమస్యలు ఉన్నవారికి ఈ పువ్వులు ఎంతో మేలు చేస్తాయి. ఈ పువ్వుల నుంచి రసాన్ని తీసి కంటి సమస్యలు ఉన్నవారికి కళ్లలో వేయాలి.
అప్పుడు కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆకులు, పువ్వులలో ఉన్న లక్షణాలు చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
నందివర్ధనం చెట్టుకు ఆయుర్వేదంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు.
కాబట్టి ఏమైనా అనుమానం ఉంటే ఆయుర్వేద వైద్య నిపుణుని సంప్రదించిన తర్వాత వాడవచ్చు.